ఐపీఎల్ ఫైనల్ లో సల్మాన్, కత్రినా సందడి..

Sun,May 12, 2019 05:55 PM
salman, katrina to host ipl final at uppal stadium


హైదరాబాద్: మరికొద్దిసేపట్లో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల టైటిల్ పోరు జరగనున్న విషయం తెలిసిందే. టైటిల్ పోరు కోసం జరుగుతున్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే ప్రేక్షకులకు మ్యాచ్ తోపాటు బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ ను చూసే అవకాశం రానుంది. బాలీవుడ్ సూపర్ హిట్ జోడీ అయిన సల్మాన్-కత్రినా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు హోస్టులుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఓ వైపు ఉత్కంఠ పోరు, మరోవైపు కత్రినా-సల్మాన్ ల సందడితో ఉప్పల్ స్టేడియం మార్మోగిపోనుంది.

1998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles