సల్మాన్ నా రియల్ లైఫ్ హీరో..

Tue,September 25, 2018 04:54 PM
salman is my real life hero says warina hussain

వరీనా హుస్సేన్..కాబూల్‌లో పుట్టిన ఈ బ్యూటీ ఏడేళ్ల క్రితం భారత్‌కు వచ్చి మోడలింగ్ ప్రారంభించింది. తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ నటిస్తున్న లవ్ యాత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతుంది వరీనా హుస్సేన్. తన రియల్ లైఫ్ హీరో సల్మాన్ నిర్మిస్తున్న లవ్ యాత్రి డ్రీమ్ ప్రాజెక్టు అని, ఈ సినిమాలో నటించే అవకాశం రావడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నానంది వరీనా.

‘నేను సినిమాల్లో నటించేందుకు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. సినిమా కోసం మూడేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నా. సినిమాలు, ప్రకటనల్లో నటించేందుకు పలు ఆడిషన్స్‌కు హాజరయ్యాను. సల్మాన్‌ఖాన్ నిర్మించే సినిమాతో సినీ పరిశ్రమలోకి రావడం గొప్ప బాధ్యత అని భావిస్తున్నా. ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్నా. ఆయన సినిమాలో అవకాశం రావడం ఇప్పటికీ కలగానే అనిపిస్తోందని తన ఆనందాన్ని పంచుకుంది’ వరీనా హుస్సేన్. అభిరాజ్ మినవాలా దర్శకత్వంలో వస్తున్న లవ్‌యాత్రి ఆయుష్ శర్మకు కూడా డెబ్యూటీ మూవీ.

2760
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles