జుమ్మే కీ రాత్‌ పాటకు స‌ల్మాన్‌తో స్టెప్పులేసిన వెంకీ, రానా

Tue,March 26, 2019 10:56 AM
salman grooves to Jumme Ki Raat with Venkatesh daggubati

విక్ట‌రీ వెంక‌టేష్ కూతురు ఆశ్రిత పెళ్ళి వేడుక‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. చాలా సీక్రెట్‌గా జ‌రిగిన డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి సంబంధించి రీసెంట్‌గా మూడు ఫోటోలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ఇక సంగీత్‌లో స‌ల్మాన్‌తో క‌లిసి వెంక‌టేష్‌, రానా చేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. స‌ల్మాన్ న‌టించిన ‘కిక్‌’ సినిమాలోని జుమ్మే కీ రాత్‌ పాటకు స‌ల్మాన్ జోష్‌తో స్టెప్పులేయ‌గా, అంతే జోష్‌తో వెంకీ కూడా చేశాడు. ఈ వీడియో ఇటు సౌత్‌, అటు నార్త్ ఇండ‌స్ట్రీల‌కి సంబంధించిన అభిమానుల‌ని అల‌రిస్తుంది. ఆశ్రిత వివాహం హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో రాజ‌స్థాన్‌లోని జ‌య‌పుర‌లో ఆదివారం ఉద‌యం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ శుభ‌కార్యానికి వెంకీ బంధువులు, స‌న్నిహితుల‌తో పాటు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌య్యారు.




1828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles