పాక్ జెండా ఎగుర‌వేసినందుకు ఇబ్బందుల్లో ప‌డ్డ స‌ల్మాన్‌

Sun,November 18, 2018 12:20 PM
salman gets trouble

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌కి వివాదాలు కొత్త కాదు. ఇటీవ‌ల కృష్ణ జింక కేసులో కొన్నాళ్ళు జైలులో కూడా ఉండి వ‌చ్చాడు. అయితే ఇటీవ‌ల రేస్ 3 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన స‌ల్మాన్ ప్ర‌స్తుతం భార‌త్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది . కత్రినా కైఫ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు విడుద‌ల కాబోతోంది. ప్ర‌స్తుతం మూవీ చిత్రీక‌ర‌ణ పంజాబ్‌లో జ‌రుగుతుంది. సినిమాకి సంబంధించి ఓ స‌న్నివేశాన్ని ఇండోపాక్ బోర్డ‌ర్‌లో చిత్రీక‌రించాల్సి ఉండ‌గా, అనుమ‌తులు లేక‌పోవ‌డంతో పంజాబ్‌లోనే సెట్ వేసి షూట్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంలో స‌ల్మాన్ పాకిస్థాన్ జెండా ఎగుర వేశాడ‌ట‌. స‌న్నివేశానికి సంబంధించి ఆ జెండా ఎగుర‌వేసిన కూడా ఆ ప్రాంత ప్ర‌జ‌లు ఆ సీన్‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ స‌ల్మాన్‌తో పాటు చిత్ర యూనిట్‌పై కేసు న‌మోదు చేశార‌ట‌. దీనిపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

2242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles