మ‌హేష్ బాబు ఫ్యామిలీలో విషాదం

Fri,December 15, 2017 12:06 PM
Sakhamuri Rambabu has passed away

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కుటుంబంలో విషాదం నెల‌కొంది. మ‌హేష్ బాబుకి వ‌రుసకి మామ‌య్య అయిన శాఖ‌మూరి రాంబాబు నిన్న‌ అకాల మ‌ర‌ణం చెందారు. మ‌హేష్ బాబుకి ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసిన ఈయ‌న ప‌ద్మాల‌య స్టూడియోకి సంబంధించి వ్య‌వ‌హరాల‌న్నింటిని చూసుకోవ‌డంతో పాటు స్టూడియో స‌క్సెస్‌లో స‌గ‌భాగం అయ్యారు అని తెలుస్తుంది. ప‌ద్మాల‌య రాంబాబుగా అందరికి సుపరిచితం అయిన ఈయ‌న ర‌మేష్ బాబుతో క‌లిసి ప్రేమ చ‌రిత్ర అనే సినిమాని కూడా ప్రొడ్యూస్ చేశార‌ట‌. రాంబాబు మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపాన్ని తెలియ‌జేస్తూ, కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతిని తెలియ‌జేశారు. ఈ రోజు శాఖ‌మూరి రాంబాబు అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్టు స‌మాచారం.

11329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS