దిలీప్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చిన ఆయ‌న భార్య‌

Fri,September 7, 2018 10:15 AM
saira updates dilip health issues

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ ఛాతి ఇన్ఫెక్షన్ వల్ల హాస్పటల్లో చేరిన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో ఆయన చికిత్స పొందుతుండ‌గా, ఆయ‌న అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పూజ‌లు చేస్తున్నారు. కొంద‌రు ఆయ‌న ఆరోగ్యంపై ఆరాలు తీస్తున్నారు. ఈ క్ర‌మంలో దిలీప్ భార్య సైరా భాను ఆయ‌న ఆరోగ్యం గురించి మీడియాకి అప్‌డేట్ అందించింది. ఆయ‌న ఛాతిలో తేలిక‌పాటి న్యూమోనియాని గుర్తించారు. వైద్యానికి దిలీప్ స‌హ‌క‌రిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఆయ‌న‌ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయ‌నున్నారు అని తెలిపారు సైరా. దిలీప్ 1994లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ , 2015లో పద్మ విభూషన్ అవార్డులను అందుకున్నారు. దేవదాస్, మొఘల్ ఏ ఆజమ్, గంగా జమునా, కర్మా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో దిలీప్ నటించారు.

2450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles