మల్టీ స్టారర్ మూవీకి నో చెప్పిన సాయిపల్లవి..!

Thu,January 18, 2018 10:58 PM
saipallavi rejects multi starrer movie Offer


హైదరాబాద్ : దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘దాగుడుమూతలు’ అనే మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శర్వానంద్, నితిన్ లను హీరోలుగా నటించనుండగా..వీరికి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవిలను ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నది. సాయిపల్లవి ఈ మూవీ నుంచి తప్పుకుందట. సినిమాలో తన పాత్రకు ఇంపార్టెన్స్ లేని కారణంగా సాయిపల్లవి నో చెప్పేసిందని టాక్. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే నితిన్ తో చేయనున్న ‘శ్రీనివాస కల్యాణం’ మూవీలో సాయిపల్లవిని హీరోయిన్ గా అనుకున్నప్పటికీ..అందుకు సాయిపల్లవి నో చెప్పిన సంగతి తెలిసిందే.

2762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles