బాలీవుడ్ బయోపిక్..హైదరాబాద్‌లో షూటింగ్

Tue,September 25, 2018 07:43 PM
Saina nehwal biopic Shoot will be in Hyderabad

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ టైటిల్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. సైనా బయోపిక్ షూటింగ్ షెడ్యూల్‌ను చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్లాన్ చేసింది. శ్రద్దాకపూర్, చిత్ర బృందం హైదరాబాద్ షెడ్యూల్ కోసం ఇక్కడికి రానుంది.

సైనా నేహ్వాల్ చిన్న వయసులో సొంత రాష్ట్రం హర్యానాలోని హిస్సార్ నుంచి హైదరాబాద్‌కు మారిన తర్వాత బ్యాడ్మింటన్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతులు గడించింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను షూట్ చేయనుంది చిత్రయూనిట్. అమోల్ గుప్తే ఈ చిత్రానికి దర్శకుడు. శ్రద్ధాకపూర్ బాహుబలి స్టార్ ప్రభాస్‌తో కలిసి సాహో చిత్రంలో కూడా నటిస్తోంది.

1919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles