కేర‌ళ వ‌ర‌ద‌ల వ‌ల‌న చైతూ సినిమా వాయిదా..!

Tue,August 21, 2018 10:50 AM

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల‌న కేర‌ళ రాష్ట్రం అత‌లాకుత‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. ఎంద‌రో నిరాశ్ర‌యుల‌య్యారు. కూడు, గుడ్డులేక దీన స్థితిలో ఉన్నారు. వారికి అండ‌గా నిలిచేందుకు సినీ ప‌రిశ్ర‌మ న‌డుంక‌ట్టింది. అన్ని భాష‌ల‌కి సంబంధించిన న‌టీన‌టులు త‌మ‌కి తోచిన స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్‌కి సాయం అందించారు. అయితే కేర‌ళ వ‌ర‌ద‌లు మ‌న రాష్ట్రంలో విడుద‌ల కానున్న సినిమాల‌పై కూడా ప్ర‌భావం చూపుతుంది. తెలుగు సినిమాల‌కి కేర‌ళ రాష్ట్రానికి చెందిన సాంకేతిక నిపుణులు కూడా ప‌నిచేస్తున్నారు. విప‌త్తు వ‌ల‌న వారు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌లేక‌పోతున్నారు. దీంతో తెలుగు సినిమాలు అనుకున్న టైంకి విడుద‌ల కాలేక‌పోతున్నాయి. నాగ‌చైత‌న్య న‌టించిన శైల‌జా రెడ్డి చిత్రం ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంటుంది. కేర‌ళ రాష్ట్రానికి చెందిన కొంద‌రు సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తుండ‌గా, ప్ర‌స్తుతం వారు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌లేక‌పోతున్నారు. అందువ‌ల‌న మా చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం అని చైతూ త‌న ట్వీట్ లో తెలిపారు. త్వ‌ర‌లోనే కొత్త డేట్ ప్ర‌కటిస్తామ‌ని అన్నారు. సినిమా వాయిదాప‌డినందుకు క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేస్తూ, కేర‌ళ బాధితుల‌కు ఎవ‌రికి తోచినంత సాయం వారు చేయాల‌ని చైతూ కోరాడు.1480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles