సైఫ్ భర్తగా దొరకడం నా అదృష్టం..

Wed,April 25, 2018 06:37 PM
Saif pushed me to get back to work says Kareena Kapoor


ముంబై: మదర్‌గా ప్రమోషన్ రావడంతో కొంతకాలంగా సినిమాలకు దూరమైంది బాలీవుడ్ నటి కరీనాకపూర్. తాజాగా రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ సిల్వర్‌స్క్రీన్ రీఎంట్రీ ఇస్తోంది. కరీనాకపూర్ నటిస్తున్న వీర్ ది వెడ్డింగ్ మూవీ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ట్రైలర్‌లో కరీనాకపూర్ తన అందం, అభినయంతో కొత్త హీరోయిన్లకు మంచి పోటీని ఇస్తోంది. పెళ్లయిన తర్వాత తిరిగి నటించడం వెనుక తన భర్త సైఫ్ అలీఖాన్ ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పింది కరీనా. నేను సినిమాకు సైన్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ కాదు. ప్రెగ్నెన్సీ తర్వాత నిర్మాత రియా కపూర్‌కు వేరే వారిని తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ రియా నా కోసం వెయిట్ చేసింది. తైమూర్ పుట్టిన తర్వాత సైఫ్ నన్ను జిమ్‌కు పంపించి ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. సైఫ్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఈ సినిమాలో నటించాను. నన్ను అర్థం చేసుకునే సైఫ్ భర్తగా దొరకడం నా అదృష్టం..అని కరీనాకపూర్ చెప్పుకొచ్చింది. వీర్ ది వెడ్డింగ్ సినిమాలో సోనమ్‌కపూర్, స్వరభాస్కర్, శిఖా తస్లానియా లీడ్ రోల్స్ పోషించారు. జూన్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.

5046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS