ప‌ద్మ‌శ్రీ అవార్డు వెనక్కి ఇవ్వాల‌నుకున్నాను : సైఫ్‌

Wed,May 15, 2019 01:38 PM

బాలీవుడ్ క‌థానాయ‌కుడు సైఫ్ అలీఖాన్ 2010లో ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీలో ఎంతో మంది టాలెంట్ ఆర్టిస్టులు ఉన్న‌ప్ప‌టికి సైఫ్ అలీఖాన్‌కి ప‌ద్మ‌శ్రీ అవార్డు రావ‌డంపై నెటిజ‌న్స్ ట్రోల్ చేశారు. వీటిని త‌న‌ చాట్ షో పించ్‌లో సైఫ్‌కి చ‌దివి వినిపించాడు అర్బాజ్‌ ఖాన్. దానిపై వివ‌రణ కూడా ఇచ్చాడు బాలీవుడ్ న‌టుడు సైఫ్‌.


రెస్టారెంట్‌లో కొంద‌రిని కొట్టిన తైమూర్ తండ్రికి ‘సేక్రేడ్‌ గేమ్స్‌’లో నటించే అవకాశం ఎలా వ‌చ్చింది. న‌ట‌నే రాని ఆయ‌న న‌వాబ్ ఏంటీ అంటూ నెటిజ‌న్స్ సైఫ్‌పై ట్రోల్స్ చేశారు. దీనిపై స్పందించిన సైఫ్ .. సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తిభ ఉన్న చాలా మంది సీనియ‌ర్ న‌టుల‌కి రాని ప‌ద్మ‌శ్రీ నాకు రావ‌డం ప‌ట్ల చాలా ఇబ్బందిగా ఫీల‌య్యాను. ఆ అవార్డుని తిరిగి ఇచ్చేద్దామ‌ని అనుకున్నాను. కాని నా క‌న్నా తక్కువ టాలెంట్ ఉన్న వారు కూడా అవార్డు అందుకున్నారు క‌దా అని ఓ సారి ఆలోచించాను. అయిన‌ప్ప‌టికి అవార్డు అందుకోవ‌డానికి మ‌న‌స్సు ఒప్పుకోలేదు.

మా నాన్న మ‌న్సూర్ అలీ ఖాన్ ప‌టౌడీ.. మంచి పొజీష‌న్‌లో ఉన్న నువ్వు భార‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేఖించ‌కూడ‌దు అని చెప్ప‌డంతో పద్మ‌శ్రీ అవార్డు అందుకున్నాను. ప్ర‌స్తుతానికి న‌ట‌న‌ని ఆస్వాదిస్తున్న నేను భ‌విష్య‌త్‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌డానికి నా వంతు కృషి చేస్తాను. అప్పుడైన ప్ర‌జ‌లు .. ఈయ‌న ప‌ద్మ‌శ్రీకి అర్హుడు అని స‌ర్టిఫికెట్ ఇస్తారేమో. ఇక త‌ను న‌వాబేంటి అని ట్రోల్ చేసిన వారికి స‌మాధాన‌మిస్తూ.. నాకు నవాబ్‌ అనే బిరుదుఇష్టం ఉండదు , కబాబులను మాత్రం చాలా ఇష్టంగా తింటానని పేర్కొన్నారు సైఫ్‌. ఇక సోన‌మ్ కపూర్ వెడ్డింగ్‌లో సింపుల్ వైట్ కుర్తా పైజామా ధ‌రించారేంట‌ని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించ‌గా, అందుకు సైఫ్‌.. ఇది ఆమె నా వెడ్డింగ్, నాది కాదు క‌దా అని పంచ్ ఇచ్చాడు.

2192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles