త‌న భ‌ర్త బ‌ర్త్‌డేని గ్రాండ్‌గా జ‌రిపిన క‌రీనా

Thu,August 16, 2018 01:38 PM
Saif Ali Khan has midnight birthday party

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నేడు 48వ ప‌డిలోకి అడుగుపెట్టాడు. ఈ క్ర‌మంలో అత‌ని పుట్టిన‌రోజుని సైఫ్ స‌తీమ‌ణి క‌రీనా క‌పూర్ గ‌త రాత్రి త‌న ఇంట్లో గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. త‌న భ‌ర్త‌తో చాక్లెట్ కేక్ క‌ట్ చేయించింది క‌రీనా. సైఫ్ బ‌ర్త్ డే కార్య‌క్ర‌మానికి క‌రీనా క‌పూర్‌, సారా అలీఖాన్, ఇబ్ర‌హీం, సోహా అలీఖాన్‌, కునాల్ కెమ్ము త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. గోల్డెన్ బెలూన్స్‌తో ఇంటిని అందంగా డెక‌రేట్ చేసిన క‌రీనా త‌న భ‌ర్త పుట్టిన రోజుని ఎప్ప‌టికి గుర్తుండేలా చేసింది. పుట్టిన రోజు సంద‌ర్భంగా త‌మ ఫ్యామిలీతో క‌లిసి దిగిన ఫోటోల‌ని త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది క‌రీనా. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్ అవుతున్నాయి. క‌రీనా- సైఫ్ దంప‌తుల‌కి తైమూర్ అనే బుడ‌త‌డు గ‌త ఏడాది డిసెంబ‌ర్ 20న జ‌న్మించ‌గా ప్రస్తుతం అత‌ను సెల‌బ్రిటీ అయ్యాడు. హర్యానాలోని పటౌడీ ప్యాలెస్‌లో తైమూర్ మొదటి జన్మదిన వేడుకలను జరిపిన సంగ‌తి తెలిసిందే.

3485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles