మారుతి దర్శకత్వంలో సినిమాకు ఓకే..!

Thu,May 2, 2019 10:29 PM


‘చిత్రలహరి’ అందించిన విజయంతో ఫుల్‌ జోష్‌ మీదున్నాడు టాలీవుడ్ నటుడు సాయితేజ్‌. ఈ యువనటుడు తాజాగా ఓ కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌తో ‘సాహో’ చిత్రాన్ని నిర్మిస్తున్న యువీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే తొలుత ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాలనుకున్నారట. కానీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించడానికి యువీ క్రియేషన్స్‌ సంస్థ ఆసక్తిని చూపించడంతో ఈ సంస్థతో కలిసి గీతా ఆర్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్న మారుతి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.

1328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles