త‌న‌కి ఏ జ‌బ్బు లేదని చెప్పిన సుప్రీమ్ హీరో!

Tue,November 19, 2019 10:39 AM

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిరోజూ పండగే అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్‌ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అయితే ఈ చిత్రంలో తేజూకి అనారోగ్య స‌మ‌స్య ఉంటుంద‌ని, దాని ఆధారంగా మారుతి కామెడీ జ‌న‌రేట్ చేసాడ‌ని విప‌రీతంగా ప్ర‌చారం చేస్తున్నారు.


మారుతి హిట్ చిత్రాల‌లో దాదాపు ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య ఉంటున్న సంగ‌తి తెలిసిందే. భలేభ‌లే మ‌గాడివోయ్ చిత్రంలో నాని మ‌తిమ‌రుపుతో ఇబ్బంది ప‌డగా, బాబు బంగారం సినిమాలో వెంకీ అతి మంచిత‌నంతో బాధ‌ప‌డ‌తారు. మ‌హానుభావుడు చిత్రంలో శ‌ర్వానంద్ ఓసీడీ (అతి శుభ్రత)తో ఇబ్బంది పడుతుంటాడు. ఇలా మారుతి సినిమాల‌లో రోగంని హైలైట్ చేస్తూ కామెడీని జ‌న‌రేట్ చేశారు. మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ప్ర‌తిరోజూ పండ‌గే సినిమాలోను తేజూకి కూడా ఏదో ఒక రోగం ఉంటుంద‌ని నెటిజ‌న్స్ చెబుతుండ‌గా, దానిని ఖండించాడు సాయిధ‌ర‌మ్. త‌న‌కి ఎలాంటి రోగంలేద‌ని, ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అని చెప్పుకొచ్చాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్‌, రావూ రమేష్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థ‌మ‌న్ చిత్రానికి స్వ‌రాలు స‌మకూరుస్తున్నారు.

1306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles