అరకురోడ్‌లో పూరీ తమ్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా ?

Tue,February 16, 2016 01:46 PM
sai ram shankar new movie poster

పూరి జగన్నాధ్‌ తమ్ముడిగా ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన సాయిరాం శంకర్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ సారి సరిక్రొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మంచి టాలెంట్‌ ఉన్న కూడా సరైన సక్సెస్‌ దొరక్క ఇబ్బందిపడుతున్న సాయిరాం ఈ సారి మాత్రం ఫామ్‌ని అందుకునే ఊపులో ఉన్నట్టు అర్దమవుతోంది.

సాయిరాం శంకర్‌ తెలుగు ఇండస్ట్రీకి ఇడియట్‌ సినిమాతో పరిచయం కాగా , హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం 143 సినిమాతో. అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సలహలు సూచనలు పాటిస్తూ మంచి హీరోగా ఎదగాలని ప్రయత్నిస్తున్న సాయిరాంతో సక్సెస్‌ దోబూచులాడుతుంది. వెరైటీ పాత్రలతో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న కూడా సక్సెస్‌ అనేది ఇప్పటికి అందని ద్రాక్షగానే మారింది

సాయిరాం నటించిన లేటెస్ట్ చిత్రం రోమియో కాగా, ఈ చిత్రం 2014 లో విడుదలైంది. ఆ తర్వాత ఈ హీరో ఎలాంటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాకపోగా ప్రస్తుతం మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. జగదాంబ, అరకురోడ్‌లో అనే సినిమాలు సెట్స్‌పై ఉండగా, వాడు నేను కాదు అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సాయిరాం సిద్దంగా ఉన్నట్టు సమాచారం

'అరకురోడ్‌లో' అనే చిత్రాన్ని వాసుదేవ్‌ తెరకెక్కిస్తుండగా, ఇటీవలే ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్‌ చేసి మూవీపై అంచనాలు పెంచారు. ఇక తాజాగా ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ని రిలీజ్‌ చేసిన యూనిట్‌ సినిమాలో ఏదో ఉందన్న ఫీలింగ్‌ కలిగించేలా చేసింది. సాయిరాం, నికిషా పటేల్, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కృష్ణభగవాన్, పృథ్వీ, సత్య, కోవై సరళ, అనన్య.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రధారులందరికీ ఈ పోస్టర్ లో చోటివ్వగా టైటిల్‌ని కూడా చాలా డిఫరెంట్‌గా డిజైన్‌ చేసి రిలీజ్‌ చేసారు

థ్రిల్లర్‌ సినిమా టచ్‌ని ఇచ్చేలా కనిపిస్తున్న ఈ సినిమాను మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండగా, అరకురోడ్‌లో చిత్రం సాయిరాంకు మంచి సక్సెస్‌ను అందిస్తుందో లేదో చూడాలి

2558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles