విజ‌య్‌తో సాయి ప‌ల్ల‌వి వివాహం.. రూమ‌ర్ అంటున్న త‌మిళ తంబీలు

Thu,March 28, 2019 08:59 AM

మ‌ల‌యాళ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి త‌మిళ డైరెక్ట‌ర్ ఏఎల్ విజ‌య్‌తో కొన్నాళ్ళ నుండి డేటింగ్ చేస్తుంద‌ని, త్వ‌ర‌లో పెళ్ళి పీట‌లు కూడా ఎక్క‌నుంద‌ని ఓ వార్త దావానంలా పాకింది. దీంతో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, అభిమానులు షాక్ అయ్యారు. అస్స‌లు పెళ్ళే చేసుకోనని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన సాయి ప‌ల్ల‌వి, పెళ్ళై డైవ‌ర్స్ ఇచ్చిన వ్య‌క్తిని ఎలా వివాహం చేసుకుంటుంద‌ని అభిమానులు చ‌ర్చించుకున్నారు. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం అదంతా రూమ‌ర్ అని, దియ(క‌ణం) అనే చిత్ర షూటింగ్ స‌మ‌యంలో సాయి ప‌ల్ల‌వి .. విజ‌య్‌కి రాఖీ కూడా క‌ట్టింద‌ని అంటున్నారు. అస‌లు వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌నే వార్త ఎక్క‌డి నుండి వ‌చ్చిందో తెలియ‌దు కాని ఒక్క‌సారి అంద‌రిని షాక్‌కి గురిచేసింద‌ని త‌మిళ తంబీలు చెప్పుకుంటున్నారు. జూన్ 12, 2014న‌ అమ‌లాపాల్‌ని వివాహం చేసుకున్న విజ‌య్ ప‌లు కార‌ణాల వ‌ల‌న 2017లో ఆమెకి డైవ‌ర్స్ ఇచ్చాడు. ఏఎల్ విజ‌య్ ప్ర‌స్తుతం దేవి 2 చిత్రంతో పాటు జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో సినిమా చేస్తున్నాడు. హిందీ, త‌మిళంలో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో కంగనా ర‌నౌత్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇక సాయిప‌ల్ల‌వి .. సూర్య హీరోగా తెర‌కెక్కుతున్న ఎన్జీకే చిత్రం చేస్తుంది. మే 31న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

3657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles