రెమ్యున‌రేష‌న్ తిరిగి ఇవ్వ‌డంపై స్పందించిన సాయి ప‌ల్ల‌వి

Fri,April 12, 2019 10:14 AM

మ‌ల‌యాళ భామ సాయి ప‌ల్ల‌వి కొద్ది రోజులుగా త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ద‌ర్శ‌కుడు విజ‌య్‌తో డేటింగ్‌లో ఉంద‌ని, త్వ‌ర‌లో వివాహం చేసుకోనుందంటూ ఇటీవ‌ల హాట్ టాపిక్‌గా నిలిచింది సాయి ప‌ల్ల‌వి. అయితే తెలుగులో ఎంసీఏ, ఫిదా చిత్రాల‌తో మంచి హిట్స్ కొట్టిన సాయి ప‌ల్ల‌వి శ‌ర్వానంద్‌తో క‌లిసి ప‌డి ప‌డి లేచే మ‌న‌సు అనే చిత్రం చేసింది. హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన‌ ఈ చిత్రంతో శ‌ర్వానంద్‌, సాయి ప‌ల్ల‌వి న‌ట‌నకి మంచి మార్కులు ప‌డ్డాయి. కాని క‌థ జ‌నాల‌కి కాస్త బోర్ కొట్టించ‌డంతో మూవీకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది.ఈ నేప‌థ్యంలో నిర్మాత‌ల‌కి కాస్త న‌ష్టం కూడా చేకూరిందని స‌మాచారం. అయితే ఈ విష‌యం సాయిప‌ల్ల‌వికి కూడా చేర‌డంతో త‌న రెమ్యున‌రేష‌న్‌ని తిరిగి నిర్మాత‌ల‌కే ఇచ్చేసిందని అన్నారు. దీనిపై సాయి ప‌ల్ల‌వి తాజాగా స్పందించింది.


ప‌డిప‌డి లేచే మ‌న‌సు చిత్రం కోసం ఏడాది పాట క‌ష్ట‌ప‌డ్డాం. కాని చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో త‌న‌కి ఇచ్చిన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేయాల‌ని భావించింది సాయి ప‌ల్ల‌వి. కాని చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి .. సాయి ప‌ల్ల‌వికి ఇచ్చిన పారితోషికాన్ని తిరిగి తీసుకునేందుకు ఆస‌క్తి చూప‌లేదు. ఇచ్చిన రెమ్యున‌రేష‌న్‌ని తిరిగి తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెబుతూ, ఈ మొత్తం త‌దుప‌రి చిత్రానికి అడ్వాన్స్‌గా భావించండని సాయి ప‌ల్ల‌వితో అన్నాడ‌ట సుధాక‌ర్‌. ఈ విష‌యంపై డిస్క‌ష‌న్‌ ఇద్ద‌రి మ‌ధ్య చాలా సీక్రెట్‌గా జ‌ర‌గ‌గా, అదెలా బ‌య‌ట‌కి వ‌చ్చిందో తెలియ‌డం లేదంటూ సాయి ప‌ల్ల‌వి ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసింది.

3807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles