రెమ్యున‌రేష‌న్ తిరిగి ఇచ్చేసిన సాయి ప‌ల్ల‌వి ..!

Tue,January 8, 2019 09:58 AM

సాయి ప‌ల్ల‌వి.. ఇప్పుడు ఈ పేరు అన్ని భాష‌ల‌లో మారి మ్రోగిపోతుంది. ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఫిదా చేసిన ఈ అమ్మ‌డు రీసెంట్‌గా ప‌డి ప‌డి లేచే మ‌న‌సు అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. శ‌ర్వానంద్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించారు. ఈ చిత్రంతో శ‌ర్వానంద్‌, సాయి ప‌ల్ల‌వి న‌ట‌నకి మంచి మార్కులు ప‌డ్డాయి. కాని క‌థ జ‌నాల‌కి కాస్త బోర్ కొట్టించ‌డంతో మూవీకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది.ఈ నేప‌థ్యంలో నిర్మాత‌ల‌కి కాస్త న‌ష్టం కూడా చేకూరిందని స‌మాచారం. అయితే ఈ విష‌యం సాయిప‌ల్ల‌వికి కూడా చేర‌డంతో త‌న రెమ్యున‌రేష‌న్‌ని తిరిగి నిర్మాత‌ల‌కే ఇచ్చేసిందని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోలు మాత్ర‌మే త‌మ రెమ్యున‌రేష‌న్‌ని ఇలా తిరిగి ఇచ్చేసిన సంద‌ర్భాలు చూశాం. కాని నిర్మాత బాగోగులు ఆలోచించిన హీరోయిన్ త‌న పారితోషికాన్ని రిట‌ర్న్‌గా ఇవ్వ‌డ‌మ‌నేది గొప్ప విష‌యం అని అంటున్నారు. సాయి ప‌ల్ల‌వి చేసిన ప‌నికి ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. సాయి ప‌ల్ల‌వి న‌టించిన మారి 2 కూడా ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే . ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ఎన్ జి కె చిత్రంలో నటిస్తుంది సాయిప‌ల్ల‌వి.

6445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles