భారీ ఆఫర్‌ కు నో చెప్పిన సాయిపల్లవి..!

Fri,August 11, 2017 08:17 PM
sai pallavi rejects a big offer !


హైదరాబాద్: శేఖర్ కమ్ముల ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది కోలీవుడ్ బ్యూటీ సాయిపల్లవి. తొలి సినిమాతోనే ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించిన ఈ హీరోయిన్ భారీ ఆఫర్ వస్తే నో చెప్పిందట. ఓ క్లాత్ షోరూం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా నిర్వాహకులు సాయిపల్లవిని కోరారట. ఇందుకోసం నిర్వాహకులు భారీ మొత్తం కూడా ఆఫర్ చేశారట. అయితే ఇలాంటి కార్యక్రమాలకు రావడం తనకిష్టముండదని సాయిపల్లవి సున్నితంగా నో చెప్పినట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొన్నాయి. తనకు టైం దొరికితే ఆస్పత్రుల ప్రారంభోత్సవాలు, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు ఉచితంగా వస్తానని చెప్పిందట సాయిపల్లవి.

5115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles