2 కోట్ల ఆఫ‌ర్‌ని సింపుల్‌గా రిజెక్ట్ చేసిన సాయిప‌ల్ల‌వి

Tue,April 16, 2019 09:02 AM

సాయి ప‌ల్లవి ఇప్పుడు ఈ అమ్మ‌డికి తెలుగు ప్రేక్ష‌కుల‌లోను మంచి క్రేజ్ ఉంది. మలయాళ సినిమా ‘ప్రేమమ్’ లో మలర్‌గా ఆక‌ట్టుకున్న‌ సాయి పల్లవి.. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వ‌చ్చిన ఫిదా చిత్రంతో ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ని ఫిదా చేసింది. ఈ అమ్మ‌డి సినిమా అంటే అభిమానుల‌లో భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. అయితే ప్ర‌తి విష‌యంలోను సూటిగా మాట్లాడే సాయి ప‌ల్ల‌వి ఒక భారీ డీల్‌ను రిజెక్ట్ చేయడం సెన్సేషన్‌గా మారింది.


ఓ కార్పోరేట్ కంపెనీ సాయి ప‌ల్లవిని ఫేస్ క్రీమ్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండాల‌ని కోరింద‌ట‌.అందుకు గాను 2 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ కూడా ఇస్తామ‌ని అన్నార‌ట‌. ఈ ఆఫ‌ర్‌ని సాయి ప‌ల్లవి సున్నితంగా తిరస్క‌రించింది. సినిమాల‌లో మేక‌ప్ వేసుకోకుండా న‌టించే నేను ఫేస్‌క్రీమ్ యాడ్‌లో ఎలా నటిస్తానని చెప్పిందట. దీంతో సదరు కార్పోరేట్ కంపెనీ మేకప్ లేకుండా నటించమని కోరిందట. దానికి కూడా సాయి పల్లవి నో చెప్పినట్టు సమాచారం. ప్ర‌స్తుతం ఈ వార్త సౌత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాయి పల్లవి..సూర్యతో కలిసి ‘ఎన్జీకే’ సినిమా చేసింది.ఈ చిత్రం మే 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మరోవైపు రానాతో కలిసి ‘విరాట పర్వం’లో సినిమాలో నటిస్తోంది సాయి ప‌ల్ల‌వి.

3770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles