రేపు రానా, సాయిపల్లవి సినిమా షురూ!

Fri,June 14, 2019 06:58 PM


రానా, సాయిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విరాటపర్వం 1992’. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రేపు గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. జులై నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌లో సాయిపల్లవి పాల్గొననుంది. రానా ప్రస్తుతం హిందీలో హాతి మేరే సాతి మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తవగానే వేణు ప్రాజెక్టు కోసం మరోసారి మేకప్ వేసుకోనున్నాడు రానా. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

1499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles