సాయి ప‌ల్ల‌వి ఖాతాలో మ‌రో అరుదైన రికార్డ్‌

Tue,September 24, 2019 01:53 PM

మ‌ల‌యాళ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఫిదా చిత్రంలో త‌న న‌ట‌న‌తో పాటు డ్యాన్స్‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకుంది . ముఖ్యంగా వ‌చ్చిండె సాంగ్‌లో సాయి ప‌ల్ల‌వి స్టెప్స్ ఆడియన్స్‌కి కేక పుట్టించాయి. ఈ సాంగ్ కొన్నాళ్ల‌పాటు వైబ్రేష‌న్స్ క్రియేట్ చేయ‌గా , ఇటీవ‌ల మారి 2 చిత్రంలో రౌడీ బేబి అనే సాంగ్‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్ ఇచ్చింది ఈ మ‌ల‌యాళీ భామ‌. ధ‌నుష్‌తో క‌లిసి సాయి ప‌ల్ల‌వి వేసిన స్టెప్స్‌కి ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు . అయితే సాయి ప‌ల్ల‌వి న‌టించిన ఫిదా చిత్రంలోని వ‌చ్చిండే సాంగ్ స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తే, దానిని రౌడీ బేబి సాంగ్ బ్రేక్ చేసింది. ఇప్పుడు మ‌రో అరుదైన రికార్డ్ ఆమె ఖాతాలో చేరింది. ఎంసీఏ చిత్రంలోని ఏవండోయ్ నాని గారు అనే సాంగ్‌కి సాయి ప‌ల్ల‌వి, నాని క‌లిసి డ్యాన్స్ చేయ‌గా, ఇందులోని స్టెప్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ సాంగ్ వంద మిలియ‌న్ వ్యూస్ మార్క్ చేరుకుంది. దీంతో సాయి ప‌ల్ల‌వి ఖాతాలో మ‌రో రికార్డ్ చేరింది. ఆమె న‌టించిన మూడు వీడియో సాంగ్స్‌కి ప‌ది కోట్ల‌కి పైగా వ్యూస్ రావ‌డం విశేషం.


3356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles