అమ‌లాపాల్ మాజీ భ‌ర్త‌తో సాయి ప‌ల్ల‌వి డేటింగ్ ?

Wed,March 27, 2019 11:36 AM

కొన్నాళ్ళు డేటింగ్ తర్వాత జూన్ 12, 2014లో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన అమలా పాల్- విజయ్ జంట 2016లో విడిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని మనస్పర్ధల కారణంగా వీరిరివురు విడిపోయారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడిగా ఏఎల్ విజ‌య్ బిజీ కాగా, న‌టిగా అమ‌లాపాల్ వ‌రుస సినిమాలు చేస్తుంది. ఏఎల్ విజ‌య్ ప్ర‌స్తుతం దేవి 2 చిత్రంతో పాటు జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో సినిమా చేస్తున్నాడు. హిందీ, త‌మిళంలో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో కంగనా ర‌నౌత్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం విజ‌య్.. మ‌ల‌యాళ భామ సాయిప‌ల్ల‌వితో డేటింగ్‌లో ఉన్నాడ‌ని, త్వర‌లో వీరిరివురు పెళ్లి ప‌ట్టాలెక్క‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.


ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో తాను అస‌లు పెళ్లే చేసుకోనున‌ని చెప్పిన సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు ఏఎల్ విజ‌య్‌ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైంద‌ట‌. 2018లో వ‌చ్చిన క‌రు చిత్రంకి విజ‌య్, సాయి ప‌ల్ల‌వి క‌లిసి ప‌ని చేసిన విష‌యం విదితమే. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డింద‌ని టాక్. సాయిప‌ల్ల‌వి, విజ‌య్ పెళ్ళికి సంబంధించిన వార్త ఇటు అభిమానుల‌ని అటు సెల‌బ్రిటీల‌ని షాక్‌కి గురి చేస్తుంది. త్వ‌ర‌లోనే వీరి వివాహానికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. సాయిప‌ల్ల‌వి ప్ర‌స్తుతం సూర్య హీరోగా తెర‌కెక్కుతున్న ఎన్జీకే చిత్రం చేస్తుంది. మే 31న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

6792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles