పవన్ డైరెక్టర్ తో మెగా మేనల్లుడు

Wed,December 13, 2017 10:00 AM
sai dharam with karunakaran

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలి ప్రేమ అనే అందమైన ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించిన కరుణా కరన్ ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తో జతకట్టాడు. కొన్నాళ్ళుగా సరైన సక్సెస్ లు లేని తేజూ ప్రస్తుతం వివి వినాయక్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటే కరుణా కరన్ మూవీని కూడా మొదలు పెట్టాడు. శంషాబాద్ లోని ప్రైవేట్ కాలేజ్ లో షూటింగ్ మొదలు కాగా, వచ్చే ఏడాది సమ్మర్ కి మూవీని రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తుంది. కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. డార్లింగ్ సినిమాలకు మాటలు అందించిన డార్లింగ్ స్వామి ఈ చిత్రానికి కూడా మాటలు అందిస్తున్నాడు. కరుణాకరన్ చివరిగా నితిన్ తో చిన్న దాన నీ కోసం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

1729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles