ఆకతాయిగా మారనున్న సాయిధరమ్ తేజ్

Mon,April 25, 2016 03:23 PM
Sai Dharam Tej,Gopichand Malineni new title

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ వరస సినిమాలతో మెగా ఫ్యాన్స్‌ని ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం తర్వాత సాయి ధరమ్ మూడు నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. అనీల్ రావిపూడితో కలిసి సుప్రీమ్ చిత్రాన్ని చేసిన తేజు, తిక్క అనే మూవీ కోసం మలేషియా వెళ్ళాడు. ఇక గోపిచంద్ మలినేనితో మాస్ మసాలా ఎంటర్‌టైనర్ చేసేందుకు సన్నద్ధం అయ్యాడు ఈ మెగా హీరో.

సాయిధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో తేజు సరసన రాఖీఖన్నా హీరోయిన్‌గా నటించింది. సాయిధరమ్ మరో చిత్రం తిక్క ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఇందులో లారెస్సా బొనేసి కథానాయికగా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత తేజు గోపిచంద్ మలినేనితో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ మూవీకి ఆకతాయి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే లాంచనంగా ప్రారంభించనున్నారట.

2037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles