పవన్‌కు బాడీగార్డ్‌గా సాయిధరమ్ తేజ్

Tue,March 15, 2016 04:01 PM
sai dharam tej with pavan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సర్ధార్ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. కాజల్, పవన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో వేడుకను మార్చి 20కు ఫిక్స్ చేయగా, మూవీ ఏప్రిల్ 8న ఉండనుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు.పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కోసం ఆయన అభిమానులే కాదు మెగా హీరోలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు అర్ధమవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్, చిరులు సర్ధార్ షూటింగ్ స్పాట్‌ను విజిట్ చేయగా, తాజాగా సాయిధరమ్ , అతని సోదరుడు స్పాట్‌కు వెళ్ళి మామయ్యతో కలిసి కాసేపు సందడి చేసారు. బాడీ గార్డుల్లా రెండు తుపాకులు పట్టుకొని పవన్ వెంట నడుస్తుంటే అక్కడి వారు ఆ సన్నివేశాన్ని చూస్తూ ఎంజాయ్ చేసారు. అంతేకాదు ఆ మూమెంట్‌కు సంబంధించిన ఫోటోలను సాయిధరమ్ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసారు. నెటిజన్లు ఆ చూస్తూ తెగ సంబరపడిపోతున్నారు.

3084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles