వ‌రుస ప్రాజెక్టుల‌కి సైన్ చేస్తున్న‌ సాయిధ‌ర‌మ్ తేజ్

Fri,August 16, 2019 09:19 AM

వరుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తి రోజు పండ‌గే అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశిఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌లో తేజూ క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన విందు అందించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. చిత్రలహరి విజయం తర్వాత తేజు పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కల‌ప‌డం విశేషం. స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు. అయితే ఈ సినిమా త‌ర్వాత తేజూ కొత్త ద‌ర్శ‌కుడు సుబ్బు, కృష్ణార్జున యుద్ధం ఫేం మేర్ల‌పాక గాంధీ డైరెక్ష‌న్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేయ‌నున్నాడు. తాజాగా ప్ర‌స్థానం ఫేమ్ దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేసేందుకు క‌మిట‌య్యాడ‌ట‌ తేజూ. భ‌గ‌వాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రం ప్ర‌తిరోజు పండగే చిత్ర షూటింగ్ త‌ర్వాత మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది.

1178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles