మెగా అభిమానుల‌కి సాయిధ‌ర‌మ్ విన్న‌పం

Sun,October 14, 2018 07:29 AM
Sai Dharam Tej requests to his fans

పిల్లా నువ్వు లేని జీవితంతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్య‌క్తిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజూ కెరీర్‌లో విభిన్న క‌థా చిత్రాలు చేశాడు. ఇందులో కొన్ని మంచి విజ‌యం సాధించ‌గా, మ‌రికొన్ని నిరాశ‌ప‌ర‌చాయి. అయితే అభిమానుల‌ ముందుకు మంచి సినిమాని తెచ్చేందుకు కృషి చేస్తున్న‌ట్టు తాజాగా తెలియ‌జేసిన సాయి ధ‌ర‌మ్ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్బంగా కేక్ క‌ట్టింగ్‌, బ్యాన‌ర్స్ లాంటివి చేయోద్ద‌ని కోరారు. వాటికి ఖర్చుపెట్టే డ‌బ్బుతో ఎవ‌రైనా చిన్నారి చ‌దువుల‌కి ఉప‌యోగించండి. అలా చేస్తే నేను ఇంకా ఆనందిస్తాను అని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ ద్వారా తెలిపాడు. తేజూ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. చివరిగా ఐలవ్ యూ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన తేజ్ త‌న త‌ర్వాతి సినిమా ఏ ద‌ర్శ‌కుడితో చేస్తున్నాడ‌నే దానిపై క్లారిటీ లేదు.4731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS