కొత్త పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు...

Wed,March 20, 2019 09:57 AM
Sai Dharam Tej comes with new name

సినిమా వాళ్ళ‌కి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ‌నే విష‌యం తెలిసిందే. విజ‌య‌ప‌థంలో న‌డిచేందుకు గాను, కొంద‌రు త‌మ పేర్లని మార్చుకుంటూ ఉంటారు. తాజాగా మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న పేరుని సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. కెరియ‌ర్ మొద‌ట్లో మంచి విజ‌యాలు సాధించిన సాయిధ‌ర‌మ్ ఈ మ‌ధ్య వ‌రుస ప్లాపుల‌తో డీలా ప‌డ్డాడు . ప్ర‌స్తుతం నేను శైల‌జ ఫేం కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో చిత్రల‌హ‌రి అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుద‌ల కానుండ‌గా, చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ వీడియోల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ప‌రుగు ప‌రుగు అంటూ సాగే లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ బ‌దులుగా సాయి తేజ్ అని టైటిల్స్‌లో రాశారు.అయితే ఇంతకాలం తనకు పెద్దగా కలిసిరాని స్క్రీన్ నేమ్‌ను సాయి తేజ్‌గా మార్చేశారన్న మాట. మరి ఈ కొత్త పేరైనా సాయి తేజ్‌కు కలిసొస్తుందేమో చూడాలి.

1718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles