కెరీర్ మొదట్లో మంచి విజయాలు సాధించిన సాయిధరమ్ తేజ్ ఆ తర్వాత డీలా పడ్డాడు. వరుస ఫ్లాపులని చవి చూశాడు. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ వంటి చిత్రాలు మెగా అభిమానులని నిరాశపరచాయి. తక్కువ టైంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న తేజూని వరుస ఫ్లాపులు పలకరిస్తుండే సరికి ఒక్క హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తేజూ తన తదుపరి చిత్రం చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి చాలారోజులు అవుతున్నప్పటికి , సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. తేజూ కొద్ది రోజులుగా జుట్టు రాలే సమస్యతో పాటు ఓవర్ వెయిట్‌తో బాధపడుతున్నాడట. జుట్టు కోసం కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరో వైపు బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తున్నాడట. ఈ క్రమంలో తేజూ తన తదుపరి చిత్రానికి గ్యాప్ ఇచ్చాడని అంటున్నారు. ఈ నెలాఖరులో కిషోర్ తిరుమలతో తేజూ చేయబోవు చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇందులో రితికా సింగ్‌ని ఓ కథానాయికగా ఎంపిక చేయగా, రెండో హీరోయిన్ కోసం కళ్యాణి ప్రియదర్శన్‌ని సెలక్ట్ చేశారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ తరువాత పరశురామ్ తో తేజూ ఓ మూవీ చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో