5 సంవ‌త్స‌రాల స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ..

Thu,November 14, 2019 09:48 AM

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి వ‌చ్చిన కుర్ర హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్. అన‌తి కాలంలోనే సుప్రీమ్ స్టార్‌గా మారిన తేజూ తొలి చిత్రంతోనే ఆక‌ట్టుకున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన తేజూ ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. చిరు పోలిక‌లు కాస్త తేజూలో ఉండ‌డంతో అభిమానుల‌కి ఈజీగా క‌నెక్ట్ అయ్యాడు. తేజూ న‌టించిన తొలి చిత్రాన్ని మంచి హిట్ చేశారు. న‌వంబ‌ర్ 14, 2014న పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం విడుద‌ల కాగా, నేటితో ఐదేళ్ళు పూర్త‌య్యాయి. అంటే సాయిధ‌ర‌మ్ తేజ్ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ఫుల్‌గా ఐదు సంవ‌త్స‌రాలు పూర్తి చేశాడు. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్, చిత్ర‌ల‌హ‌రి వంటి చిత్రాలు తేజూ కెరియ‌ర్‌లో మంచి హిట్ చిత్రాలు అని చెప్ప‌వ‌చ్చు. త‌న ఐదేళ్ళ కెరియ‌ర్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ మొత్తం 12 చిత్రాలు చేశాడు. తాజా చిత్రం ప్ర‌తి రోజు పండుగే డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మారుతి తెర‌కెక్కించిన ఈ చిత్రం మంచి విజ‌యం అందిస్తుంద‌ని తేజూ భావిస్తున్నాడు.

1165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles