ఇంటి నుండి త‌ల్లిని వెళ్ళ‌మంటున్న‌ హీరోయిన్..!

Sat,April 13, 2019 01:33 PM

ఖ‌డ్గం, పెళ్ళాం ఊరెళితే, ఈ అబ్బాయి చాలా మంచోడు వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన హీరోయిన్ సంగీత‌. తెలుగులో ఆమెకి స‌క్సెస్ ప‌ర్సంటేజ్ చాలా త‌క్కువ‌. పెళ్లి త‌ర్వాత త‌మిళ సినిమాల‌లోనే న‌టిస్తున్న సంగీత ప్ర‌స్తుతం వలసరవాక్కంలో త‌న త‌ల్లి ఇంట్లో భ‌ర్త‌తో క‌లిసి నివ‌సిస్తుంది. అయితే ఈ ఇల్లుని తన అన్నయ్య ఎక్క‌డ‌ అపహరిస్తారో అనే భయంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళ‌మ‌ని త‌ల్లి భానుమతిపై ఒత్తిడి తెస్తుంద‌ట సంగీత.


సంగీత ఇప్పుడుంటున్న ఇల్లు ఆమె త‌ల్లి భానుమతి మామ గారిది. ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత భానుమ‌తికి ఇల్లు ద‌క్కింది. అయితే ఈ ఇంటిని భానుమ‌తి .. సంగీత పేరుపైన రాసింది. కొన్నాళ్ల నుండి భానుమ‌తి కింద పోర్ష‌న్‌లో ఉంటుండ‌గా, సంగీత త‌న భ‌ర్త‌తో పై భాగంలో నివసిస్తుంది. ఇల్లు ఎక్క‌డ త‌న నుండి చేజారి పోతుందేమోన‌న్న అనుమానంతో త‌ల్లిని ఇంటి నుండి వెళ్లిపోమంటుంద‌ట సంగీత‌. అయితే త‌న చిన్న కొడుకు ఇటీవ‌లే మ‌ర‌ణించాడు. వ‌య‌స్సు పైబ‌డ‌డంతో తాను ఎక్క‌డికి వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో భానుమ‌తి తమిళనాడు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సంగీతకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో సంగీత తన భర్తతో కలిసి మహిళా కమిషన్ ఎదుట హాజరైంది. ఈ వ్య‌వ‌హారంపై మీడియా ఆమెని ప్ర‌శ్నించగా, స‌మాధానం ఇచ్చేందుకు నిరాక‌రించింది.

6257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles