ఘ‌నంగా జ‌రిగిన దేవిశ్రీ ప్ర‌సాద్ సోదరుడి వివాహం

Thu,July 11, 2019 08:18 AM
sagar got married to mounica

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్ మంచి సింగ‌ర్‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దేవి శ్రీ సంగీత సార‌థ్యంలో మంచి పాట‌లు పాడాడు. ఆయ‌న వివాహం జూన్ 19న జ‌రిగింద‌ని దేవి శ్రీ ప్ర‌సాద్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. నా ప్రియ‌మైన సోద‌రుడు సాగ‌ర్‌.. డాక్ట‌ర్ మౌనికని వివాహం చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నందుకు సంతోషంగా ఉంది. జూన్ 19 మా అమ్మ‌నాన్నల పెళ్ళి రోజ కావ‌డం విశేషం అని దేవి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కుటుంబంలోకి మౌనికా సాగర్‌కి స్వాగ‌తం. ఈ జంటకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’ అని దేవిశ్రీ ట్వీట్‌ చేశారు. సాగ‌ర్ వివాహానికి కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.

సాగర్... ఆర్య, నేను లోకల్, జనతా గ్యారేజ్, బొమ్మరిల్లు, జులాయి, డీజే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు పాటలు పాడారు . డీజే చిత్రంలో సాగర్ పాడిన బాక్స్ బద్దలైపోద్ది సాంగ్ మ్యూజికల్ హిట్ అయ్యింది. ఆర్య సినిమాలో ‘నువ్వుంటే నిజమేగా సత్యం, వర్షం సినిమాలోని నీటి ముళ్లై నన్ను గిల్లు, ‘జనతా గ్యారేజ్‌’లో నేను పక్కా లోకల్ సాంగ్స్ ఆయ‌న‌కి మంచి పేరు తీసుకువచ్చాయి.



2958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles