27 ఏళ్ళ త‌ర్వాత స‌డ‌క్2తో ప్రేక్ష‌కుల ముందుకు..

Thu,September 20, 2018 11:27 AM
Sadak 2 teaser released

సంజ‌య్ ద‌త్, పూజా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మ‌హేష్ భ‌ట్ తెర‌కెక్కించిన చిత్రం స‌డ‌క్‌. 1991లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. వ్య‌భిచార ముఠా పూజా భ‌ట్‌ని బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్ళి ఆమె వ్య‌భిచారంలోకి దింపేందుకు ప్ర‌య‌త్నించ‌గా, టాక్సీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న సంజ‌య్ ఆమె ప్రేమ‌లో ప‌డి పూజాని అక్క‌డి నుండి త‌ప్పిస్తాడు. వారి మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో స‌డ‌క్ చిత్రం రూపొందింది. 27 ఏళ్ళ క్రితం తెర‌కెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు స‌డ‌క్ 2 అనే చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు మ‌హేష్ భ‌ట్ ప్లాన్ చేశాడు. ఈ రోజు మ‌హేష్ భ‌ట్ పుట్టిన రోజు సంద‌ర్భంగా స‌డ‌క్ 2 టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌డ‌క్‌లోని స‌న్నివేశాల‌ని చూపించి ఆ త‌ర్వాత సీక్వెల్‌లో న‌టించేవారి పేర్లు రివీల్ చేశారు. 2020లో మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రంలో సంజ‌య్ ద‌త్‌, పూజా భ‌ట్‌, ఆదిత్య రాయ్ క‌పూర్‌తో పాటు అలియాభ‌ట్ కూడా న‌టిస్తుంది. సీక్వెల్ చిత్రం మొద‌టి పార్ట్‌కి కొన‌సాగింపుగా ఉంటుందా లేక కొత్త క‌థ‌తో తెర‌కెక్కుతుందా అనేది తెలియాల్సి ఉంది.

1239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS