మ‌హాన‌టి 'స‌దా న‌న్ను' ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

Sun,July 1, 2018 09:59 AM
Sada Nannu Full Video Song released

అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన‌ చిత్రం మహానటి. కీర్తిసురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కించాడు . ప్రియాంకదత్ నిర్మాత. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్‌సల్మాన్ , రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌ రాజ్, షాలిని పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకుడు క్రిష్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రధారులు. మే 9న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది. ముఖ్యంగా మిక్కీ జే మేయ‌ర్ స‌మ‌కూర్చిన స్వ‌రాలు కూడా సినిమా స‌క్సెస్‌లో స‌గ‌భాగం అయ్యాయి. తాజాగా సదా నన్ను అంటూ సాగే పాట వీడియోని విడుద‌ల చేశారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌, కీర్తి సురేష్‌ల‌పై చిత్రీక‌రించిన ఈ సాంగ్ పాత కాలాన్ని గుర్తు చేస్తుంది. ఈ పాట‌కి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు. చారుల‌త మ‌ణి పాట పాడారు. పీరియాడిక్ బయోపిక్ గా రూపొందిన మహానటి చిత్రంలో సావిత్రి సినీ, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాలను అద్భుతంగా చూపించారు.


1570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles