క్రీడా నేప‌థ్యంలో మ‌రో బ‌యోపిక్.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Tue,April 16, 2019 11:13 AM
Saand Ki Aankh New Poster revealed

ప్ర‌స్తుతం బ‌యోపిక్ ట్రెండ్ న‌డుస్తుంది. ముఖ్యంగా క్రీడా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రాల‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. క్రికెట్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్ ఇలా ప‌లు క్రీడ‌ల‌కి సంబంధించిన క్రీడాకారుల జీవిత నేప‌థ్యంలో బ‌యోపిక్స్ రూపొందుతుండ‌గా, తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా తుషార్‌ హీరానందని బ‌యోపిక్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ‘వృద్ధాప్యం శరీరానికే.. మనసుకు కాదు’ అని రాసి ఉన్న క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంటుంది.

చిత్రంలో 87 ఏళ్ళ చంద్రో తోమ‌ర్ పాత్ర‌లో తాప్సీ పన్ను న‌టిస్తుండ‌గా,82 ఏళ్ళ‌ ప్రకాశీ తోమర్ పాత్ర‌లో భూమి పడ్నేక‌ర్ న‌టిస్తున్నారు. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌లో తాప్సీ , భూమి ఇద్ద‌రు ప్రోస్తెటిక్ మేక‌ప్‌తో చంద్రో, ప్రకాశీలా క‌నిపిస్తున్నారు. ఈ మహిళా షూటర్లకు యూపీలో ‘షూటర్‌ దాదీస్‌’గా మంచి పేరుంది. వారి స్వ‌స్థ‌లం బాగ్ ప‌ట్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. తాప్సీ, భూమిలు కొద్ది రోజులు దాదీస్ ఇంట్లోనే ఉండి అన్ని విష‌యాలు తెలుసుకున్నారు. ఇవి సినిమాకి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని తాప్సీ అన్నారు. దీపావళి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ఆలోచ‌న చేస్తున్నారు మేక‌ర్స్‌.

801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles