‘సామి 2’ ట్రైలర్‌కు కోటి వ్యూస్

Mon,June 11, 2018 04:39 PM
saamy 2 trailer get over 1 crore real time views

చియాన్ విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘సామి 2’. హరి దర్శకత్వంలో పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విక్రమ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా..దర్శకుడు హరి తనదైన శైలిలో రూపొందించిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సామి 2 ట్రైలర్‌కు యూట్యూబ్‌లో కోటి వ్యూస్ రావడంతోపాటు లక్షా 90 వేల లైక్స్ వచ్చాయి.

విక్రమ్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తుండగా..దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2003లో వచ్చిన సామి చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రయూనిట్ ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సామి 2 ట్రైలర్‌ను మీరూ వీక్షించండి..

2688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles