మే నుండి సెట్స్ పైకి ..

Wed,January 18, 2017 09:33 AM
Saamy 2 reamke in soon

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్ అనే గూడా ఛారి పాత్రలో విక్రమ్ కనిపించనుండగా, ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్ ఆడియన్స్ లో ఫుల్ హైప్ తెస్తున్నాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉన్న విక్రమ్ ని చూసి అభిమానులు... తమ అభిమాన హీరోని హాలీవుడ్ హీరోతో పోల్చుకుంటున్నారు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదల కానుందని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్స్ తర్వాత సామికి సీక్వెల్ లో విక్రమ్ నటించనున్నాడని అప్పట్లోనే ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం సామి2 మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుందని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం హరి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ మూవీతో పాటు డోంట్ బ్రీత్ అనే హాలీవుడ్ మూవీని రీమేక్ చేసే ఆలోచనలో విక్రమ్ ఉన్నాడని సమాచారం.

1296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS