ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో విక్ర‌మ్‌.. ఫ‌స్ట్ లుక్ అవుట్‌

Fri,May 18, 2018 08:49 AM
saamy 2 motion poster out

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా చేశాడు. ఇందులో జాన్ అనే గూడా ఛారి పాత్రలో విక్రమ్ క‌నిపించాడు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన‌ ఈ చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉంది . ఇక విక్ర‌మ్ ప్ర‌స్తుతం సామికి సీక్వెల్ లో న‌టిస్తున్నాడు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ సామి చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం హరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

సామి 2 చిత్రంలో విక్రమ్ సరసన కథానాయిక‌గా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా, బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శిబు థామీన్స్ నిర్మాణంలో సామి2 రూపొందుతుంది. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో విక్ర‌మ్ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపిస్తున్నాడు. హ‌రి- విక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో ఈ మూవీపై కూడా అభిమానులు ఎక్స్‌పెక్టేష‌న్స్ బాగానే పెట్టుకున్నారు. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్ సామి2 ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. త‌మీన్‌ ఫిలింస్‌ చిత్రాన్ని నిర్మి‍స్తోంది.

2345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles