'సామి 2' నుండి ఎమోష‌న‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

Sat,October 6, 2018 12:37 PM
Saamy 2 Amma Amma Video song released

చియాన్ విక్రమ్, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో హ‌రి తెర‌కెక్కించిన చిత్రం సామి స్క్వేర్ (సామి 2). 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ సామి చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందింది , బాబి సింహా, ప్రభు, సూరి చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. శిబు థామీన్స్ నిర్మాణంలో సామి2 రూపొందనుంది. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు . సినిమాటోగ్రాఫర్‌గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్ సామి2 ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ సినిమాపై అమితాస‌క్తిని పెంచింది. తాజాగా అమ్మ అమ్మ అనే ఎమోష‌నల్ సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. వివేక ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా బెన్నీ ద‌యాల్‌, ఆంథోని దాస‌న్ క‌లిసి పాడారు. మ‌రి ఈ వీడియో సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.

1735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles