ట్రైల‌ర్ తో అంచ‌నాలు పెంచిన యంగ్ హీరో

Sun,July 8, 2018 08:16 AM
Saakshyam Theatrical Trailer released

జ‌య జానకి నాయక తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సాక్ష్యం’. శ్రీవాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. శరత్‌కుమార్, జగపతిబాబు, మీనా, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతుంది. నిన్న సాయంత్రం చిత్ర ఆడియో వేడుక గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఇందులో స‌న్నివేశాలతో పాటు విజువ‌ల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాయి. 'బాహుబలి' చిత్రానికి సిజి వర్క్ చేసిన టీమే ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. 'టైమ్స్ మ్యూజిక్ సౌత్' సంస్థ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు అందించారు. ఈ చిత్రం శ్రీనివాస్‌కి మంచి హిట్ అందిస్తుంద‌ని టీం భావిస్తుంది.

3365
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles