'సాక్ష్యం' టీజ‌ర్ వ‌చ్చేసింది

Wed,April 18, 2018 02:03 PM
Saakshyam Official Teaser released

జయ జానకి నాయక తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సాక్ష్యం’. శ్రీవాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. శరత్‌కుమార్, జగపతిబాబు, మీనా, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం అమెరికాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. కొద్ది సేప‌టి క్రితం చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇది అభిమానుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఐదు భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ఉంటాయ‌ని తెలుస్తుంది. మే రెండో వారంలో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేయ‌గా, ప్ర‌స్తుతం ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జ‌రుపుకుంటుంది. హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు 8కోట్లకు అమ్ముడయ్యాయి. తాజాగా తెలుగు శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అయిదున్నర కోట్లకు అమ్ముడయ్యి రికార్డ్‌ సృష్టించిందని స‌మాచారం. బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఈ మూవీ మంచి హిట్‌గా నిలుస్తుంద‌ని టీం చెబుతుంది. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వర్ చిత్రానికి సంగీతం అందించ‌గా, సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు అందించారు.

2413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles