ప్ర‌భాస్ అభిమానులు ఇక సిద్దం కండి..!

Thu,August 8, 2019 11:34 AM
saaho  trailer will be out on 10th August

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రం సాహో. ప్ర‌భాస్ , శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆగ‌స్ట్ 30న సాహో చిత్రం విడుద‌ల కానుండ‌గా, మూవీపై ఆస‌క్తి పెంచేందుకు మేక‌ర్స్ విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పోస్ట‌ర్స్‌, మేకింగ్ వీడియోస్ ఇలా సినిమాకి సంబంధించి ఏదో ఒక‌టి విడుద‌ల చేసి అంచ‌నాల‌ని రెట్టింపు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సాహో చిత్ర ట్రైల‌ర్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఆగ‌స్ట్ 10న ట్రైల‌ర్ విడుద‌ల కానుందంటూ పోస్ట‌ర్ ద్వారా తెలిపింది చిత్ర నిర్మాణ సంస్థ‌. అయితే ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మాన్ని భారీ ఈవెంట్‌గా జ‌ర‌పాల‌ని టీం ఆలోచ‌న చేస్తుంద‌ట‌. ముందుగా హిందీలో చిత్ర ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసి ఆ త‌ర్వాత మిగ‌తా భాష‌ల‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ట్రైల‌ర్ ద్వారా సినిమా స్టోరీ తెలియ‌కుండా ఉండేలా మేక‌ర్స్ ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోవిడుద‌ల కానున్న ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్‌ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

1363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles