పాట మిన‌హా షూటింగ్ పూర్తి.. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న సాహో

Sat,June 8, 2019 07:46 AM
saaho talkie part completed

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం సాహో. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మ‌రో 68 రోజుల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర షూటింగ్ గ‌త వారం రోజులుగా హైద‌రాబాద్‌లోని రామోజీఫిలిం సిటీలో జ‌రుపుకుంది. చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి అయింద‌ని తెలుస్తుండ‌గా, ఈ నెల 9 నుండి అన్న‌పూర్ణ స్టూడియోలో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌పనున్న‌ట్టు స‌మాచారం. సాంగ్ కోసం భారీ సెట్స్ కోసం రూపొందించిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, ప్రీ రిలీజ్ వేడుక‌ల‌ని ఘ‌నంగా జ‌ర‌ప‌నున్నారు. బాహుబ‌లి సినిమా మాదిరిగానే ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో వీలున్న ప్రతి వేదికపైనా ప్రచారం చేసేందుకు సుజీత్ -యువి బృందం ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. సాహో చిత్రాన్ని కేవలం ఇండియాలోనే కాదు.. చైనా, జపాన్ ,అమెరికా, బ్రిటన్, మలేషియా,సింగపూర్ తదితర లొకేషన్లలోనూ భారీగా రిలీజ్ చేయాలని టీం ఆలోచిస్తుంది. ఇందులో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నీల్ నితిన్ ముఖేశ్, వెన్నెల కిశోర్ , మురళీ శర్మ, జాకీష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

2322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles