అమెజాన్ ప్రైమ్‌లో సాహో.. భారీ డీల్ కుదుర్చుకున్న సంస్ధ‌

Wed,October 16, 2019 01:14 PM

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఆగ‌స్ట్ 30న విడుద‌లైన భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో. ప్ర‌భాస్ , శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుజీత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ ఇలా ప‌లు భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ ల‌భించింది. అయితే దాదాపు రూ.42 కోట్ల భారీ ధ‌ర‌తో సాహో డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ ద‌క్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 19న తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో స్ట్రీమింగ్‌ జ‌ర‌ప‌నుంద‌ట‌. హిందీ వ‌ర్షెన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంచుతార‌ట‌. అత్యున్నత సాంకేతిక నిపుణులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందిన సాహో సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అలరించ‌క‌పోయిన హిందీలో మాత్రం హ‌వా చూపించింది. పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన సాహో చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌గా, బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో సాహో చిత్రం తెర‌కెక్కిన విష‌యం విదిత‌మే.

4523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles