వైర‌ల్‌గా మారిన ప్ర‌భాస్ సాహో ఫోటోలు

Wed,May 2, 2018 09:54 AM
Saaho prabhas photos leaked

బాహుబ‌లి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌డం సంపాదించిన హీరో ప్ర‌భాస్‌. ఇప్పుడు ఈ హీరో సినిమాల‌పై తెలుగులోనే కాదు హిందీలోను భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ర‌న్ రాజా ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం సాహో సినిమా చేస్తున్నాడు ప్ర‌భాస్. ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ బేనర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం దుబాయ్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని రిస్కీ స్టంట్స్ ఉంటాయని తెలుస్తుండగా, హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో యాక్ష‌న్ సీక్వెన్స్ రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. బుర్జ్ క‌ల్ఫియా, రాస్ అల్ కైమా, వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ ప్రాంతాల‌లో ప్ర‌భాస్‌పై చేజింగ్ సీన్స్ తీయ‌నున్నార‌ట‌.

తాజాగా సాహో మూవీ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌లో బైక్‌ మీద కూర్చున్న స్టిల్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు బ‌య‌ట‌కి రాక‌పోవ‌డంతో లీకైన ఫోటోస్‌లో ప్రభాస్‌ని చూసిన ఫ్యాన్స్ తెగ సంతోష‌ప‌డుతున్నారు. సాహో ఒక నవల తరహాలో కొనసాగే యాక్షన్ డ్రామా కాగా ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ , జాక్ ష్రాఫ్ , చుంకీ పాండే,అరుణ్ విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రం హిందీ థియేట్రిక‌ల్ రైట్స్‌ని టీ సిరీస్ భూష‌న్ 120 కోట్ల‌కి ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే.

3659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles