సింగిల్ ఫ్రేమ్‌లో సాహో గ్యాంగ్

Thu,August 8, 2019 09:29 AM
saaho gang in single frame

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సాహో. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. చిత్రంలో న‌టించిన ప‌లువురు న‌టీన‌టుల పాత్ర‌ల‌కి సంబంధించి రోజుకో పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ మూవీకి మరింత ఆస‌క్తి పెంచుతున్న టీం సాహో ప్రధాన పాత్రధారులందరిని క‌లిపి పోస్ట‌ర్‌గా వదిలింది. ఈ పోస్ట‌ర్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్‌ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి భారీ బిజినెస్ జ‌రుగుతుండ‌గా, బాహుబ‌లి రికార్డుల‌ని ఈ చిత్రం బ‌ద్దలు కొడుతుందా అనే దానిపై ఇప్పుడు హాట్ హాట్ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

1307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles