వేశ్య పాత్ర‌లో న‌టించేందుకు సిద్ధ‌మైన ఆర్ఎక్స్ 100 బ్యూటీ ?

Sat,June 8, 2019 07:54 AM
RX100 Beauty To Turn Prostitute For A Biopic

ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి క్రేజ్ పొందిన న‌టి పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్స్‌తో దూసుకెళుతుంది. ఇటీవ‌ల విడుద‌లైన‌ సీత సినిమా కోసం పాయల్ రాజ్‌పుత్ ఐటెం గార్ల్ అవతారమెత్తింది. అలాగే `RDX ల‌వ్‌` అనే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో న‌టిస్తుంది.సి. క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భాను శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. వెంకీ మామ చిత్రంలో వెంకీ స‌ర‌సన క‌థానాయిక‌గాన‌టిస్తుంది పాయ‌ల్‌. తాజా స‌మాచారం ప్ర‌కారం పాయ‌ల్.. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్క‌నున్న‌ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బ‌యోపిక్ లో వేశ్య పాత్ర పోషిస్తుంద‌ని అంటున్నారు. చిత్రంలో టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు పాత్రని బెల్లంకొండ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఆగ‌స్ట్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు స‌మాచారం. 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా అంద‌రిని వ‌ణికించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర్‌రావు బ‌యోపిక్ ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రించ‌నుంద‌ని అంటున్నారు .

2428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles