మరో తెలుగు సినిమాపై కన్నేసిన పరాయి భాష నిర్మాతలు

Wed,August 15, 2018 10:16 AM
rx 100 remake in tamil

మన టాలీవుడ్ సినిమా ఇప్పుడు అన్ని భాషల సినిమాలకు ఊరించే వస్తువుగా మారింది. మనవాళ్ళ టాలెంట్ కి దేశమంతా ఫిదా అవుతుంది. ఇక్కడ రిలీజ్ అయ్యే సినిమాలపై వేరు వేరు భాషల మూవీ మేకర్స్ ఒక కన్నేసి ఉంచుతున్నారు. కొత్తకథ ఏది వచ్చినా చటుక్కున పట్టేసుకోవాలనే ఆశతో దూసుకోస్తున్నారు. ఇప్ప‌టికే ఇటీవ‌ల భారీ విజ‌యాన్ని సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం త‌మిళం, హిందీలో రీమేక్ అవుతుంది. తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ మూవీని రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఆరెక్స్ 100 మూవీ 2 కోట్ల బడ్జెట్ తో వచ్చి 15 కోట్ల పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన ఈ సినిమా హిట్ అవడంతో రీమేక్ హక్కులు భారీగా సేల్ అయ్యాయి. ఈ సినిమా హింది వర్షన్ అజయ్ డైరక్షన్ లోనే వస్తుందని తెలుస్తుండగా.. తమిళ రీమేక్ మాత్రం ఆది పినిశెట్టి సొంతం చేసుకున్నాడట‌.

ఆర్ ఎక్స్ హండ్రెడ్ తమిళ్ రీమేక్ లో ఆది పినిశెట్టినే హీరోగా నటించనున్నాడని తెలుస్తుంది. ఇందులో హీరోయిన్ గా తాప్సీని సెల‌క్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ మూవీలో లిప్ లాక్ లు, హాట్ సీన్స్ వుండటంతో తాప్సీ అన్నింటికి ఒప్పుకుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కోలీవుడ్‌లో భారీ చర్చే జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

5237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS