ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్‌లో క‌థానాయిక ఎవ‌రంటే ?

Tue,March 26, 2019 12:50 PM
RX 100 movie hindi details announced

త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ఆర్ ఎక్స్ 100. కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి చిత్రాన్ని తెర‌కెక్కించాడు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. చిత్రంలో హీరో హీరోయిన్‌ల మ‌ధ్య రొమాన్స్ యువ‌తకి బాగా క‌నెక్ట్ అయింది. ముఖ్యంగా ప్రేమ‌లో విఫ‌ల‌మైన హీరో పాత్ర‌లో కార్తికేయ‌, ఒకవైపు కోరిక‌తో ర‌గిలిపోతూ, లోలోప‌ల కుట్ర‌లు చేసే పాత్ర‌లో పాయ‌ల్ రాజ్ అద్భుతంగా న‌టించారు. వీరి న‌ట‌న‌కి సినీ ప్రేక్ష‌క‌లోకం కాస్త థ్రిల్‌గా ఫీలైంది. ఈ నేప‌థ్యంలో ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని హిందీలో నిర్మించేందుకు ప్ర‌ముఖ నిర్మాత సాజిద్ న‌డియావాలా స‌న్నాహాలు చేస్తున్నారు. కార్తికేయ పాత్ర‌లో సునీల్ శెట్టి కుమారుడు అహ‌న్ న‌టించ‌నున్నాడు. మిల‌న్ లుత్రియా చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఇక క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తార‌ని కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుగుతుండగా, తారా సుత‌రియాని ఫైన‌ల్ చేశారు. ఈ అమ్మ‌డు బెస్ట్ ఆఫ్ ల‌క్ నిక్కీ, ఓయ్ జెస్సీ సీరియ‌ల్స్‌తో పాపుల‌ర్ కాగా, స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 చిత్రంతో హీరోయిన్‌గా వెండితెర‌కి ప‌రిచ‌యం అయింది.

హిందీ రీమేక్ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌జు జ‌రుపుకుంటుండ‌గా, 2019 ద్వితీయార్ధంలో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని అనుకుంటున్నార‌ట‌. ముస్సోరీ, డెహ్రాడూన్, రిషికేష్‌తో పాటు చ‌ల్ల‌టి ప్ర‌దేశాల‌లో ఈ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రప‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం అహన్‌, తారాలు వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుందనే న‌మ్మ‌కంతో ఉంది చిత్ర బృందం. కన్న‌డ‌లోను ఆర్ఎక్స్ 100 చిత్రం రీమేక్ అవుతున్న విష‌యం విదిత‌మే

2147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles